ఇంత వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదో నాకే తెలియదు !

Telugu Lo Computer
0


కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఓ ఇటాలియన్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో వ్యక్తిగత, ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అసలు ఇంత వరకు తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదో తనకే తెలియదని అన్నారు. చాలా పనులు చేయాల్సి ఉందన్నారు. అయితే.. తనకు పిల్లలు మాత్రం కావాలని ఉందని చెప్పారు. తనకు నానమ్మతో ఎక్కువ చనువు ఉండేదనీ, తన సోదరి ప్రియాంక ఇటాలియన్ అమ్మమ్మతో ఎక్కువ చనువు ఉండేదన్నారు. భారత్ జోడో యాత్రకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్లు మేర తన యాత్ర సాగిందన్నారు. పాదయాత్ర పూర్తి అయ్యే వరకు గడ్డం తీయకూడదని భావించినట్లు తెలిపారు. ఇప్పుడు గడ్డం తీయాల వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)