శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 21 February 2023

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల


తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ ఆన్ లైన్ లో  విడుదల టీటీడీ చేయనుంది. మార్చి, ఏప్రిల్, మేనెలలకు సంబంధించిన టికెట్లను ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనుంది. కాగా నేటి ఉదయం పదింటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకూ ఆన్ లైన్ లక్కీ డీప్ నిర్వహించనున్నారు. ఈ లక్కీ డీప్ లో టికెట్లు పొందిన భక్తులు నిర్దేశిత రుసుము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలనితిరుమల తిరుపతి దేవస్థానం  సూచించింది. టీటీడీ ఆర్జిత సేవల్లో ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలున్నాయి. తిరుమలలో అక్రమాల నివారణకు టీటీడీ సరికొత్త విధానం అమల్లోకి తెస్తోంది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకతను పెంచేందుకు వీలుగా ఫేస్ రికగ్నషన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ టెక్నాలజీ అందుబాటులోకి తేనుంది. సర్వదర్శనం కాంప్లెక్స్‌లో ఒకే వ్యక్తి అధిక లడ్డూ టోకెన్లు పొందకుండా గదుల కేటాయింపు కేంద్రాల దగ్గర కాషన్ డిపాజిట్ కౌంటర్ల దగ్గర ఈ టెక్నాలజీని వాడకంలోకి తీసుకురానున్నట్టు చెప్పారు అధికారులు. ప్రస్తుతం అయితే తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. 

No comments:

Post a Comment