కుల గణన కోసం యూపీ అసెంబ్లీలో ప్రతిపక్షాలు డిమాండ్

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌ఎల్‌డీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రచ్చరచ్చ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ నేతలు వెల్‌లోకి దిగి శివపాల్‌సింగ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. గందరగోళం మధ్య వారిని వాళ్ల స్థానాల్లోకి రావాలని స్పీకర్ హెచ్చరించినప్పటికీ వాళ్లు మాత్రం పట్టించుకోకుండా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ కుల గణన అంశంపై యోగి ప్రభుత్వాన్ని నిలదీశారు. యూపీలో కుల గణన జరగాలని మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. కుల గణన లేకుండా అందరి అభివృద్ధి జరగదని, బీజేపీ ప్రభుత్వం ఎందుకు కుల గణన డిమాండ్ నుంచి వైదొలుగుతోందో ఈ ప్రభుత్వమే చెప్పాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. యూపీలో కుల గణన జరగాలని ఎస్పీ గతంలో కూడా డిమాండ్ చేసిందని, ఇప్పటికీ అనుకూలంగానే మేము ఉన్నామని అఖిలేష్ యాదవ్ గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం యూపీ ప్రజల కోసం పని చెయ్యడం లేదని, ఢిల్లీ ప్రజల కోసం పని చేస్తోందని మాజీ అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వాన్ని ఎద్దేవ చేశారు. ఉత్తరప్రదేశ్ లో అనేక జిల్లాల్లో వెనుకబడిన వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అందరికి న్యాయం జరగాలంటే వెంటనే యూపీలో కుల గణన జరగాలని ఎస్పీతో పాటు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. కుల గణన, జనాబా లెక్కలు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని, అది మా పరిదిలో లేదని యూపీ మంత్రి సురేష్ ఖన్నా ప్రతిపక్షాలకు సమాధానం ఇచ్చారు. అయితే బీజేపీ ప్రభుత్వం కావాలనే కుల గణన జరగకుండా అడ్డుకుంటున్నదని యూపీలో ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. గతంలో బీజేపీ కూడా కుల గణనకు అనుకూలంగా ఉండి ఇప్పుడు మాట మార్చుతోందని ప్రతిపక్ష్ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)