అంబులెన్సులో చెప్పులు రవాణా !

Telugu Lo Computer
0


రాజస్థాన్ లోని జైపూర్ నుండి దౌసాకు అంబులెన్స్ లో డ్రైవర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి పాదరక్షలను రవాణా చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు అతన్ని విధుల నుండి తొలగించారు. ఒక ఎన్జీవో ద్వారా ఈ డ్రైవర్ ను నియమించామని, ఇప్పటికే అతన్ని డ్యూటీ నుంచి తీసివేశామని దౌసా ప్రభుత్వ ఆసుపత్రి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివరామ్ మీనా స్పష్టం చేశారు. దర్యాప్తు కోసం ఒక ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తాము తదుపరి చర్యలపై దృష్టి సారిస్తామని మెడికల్ ఆఫీసర్ తెలిపారు. అవసరమైతే నిందితునిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామన్నారు. ఇది అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించిన ఆస్పత్రి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ మీనా ఈ విషయంపై సరైన విచారణకు తాను హామీ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)