ఎఐఎడబ్ల్యుయు నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా విజయరాఘవన్‌, వెంకట్‌ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 18 February 2023

ఎఐఎడబ్ల్యుయు నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా విజయరాఘవన్‌, వెంకట్‌


అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా విజయరాఘవన్‌, బి.వెంకట్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 155 మందితో జనరల్‌ కౌన్సిల్‌ ఏర్పాటైంది. తెలంగాణా నుండి 15 మంది, ఎపి నుండి 12 మంది జనరల్‌ కౌన్సిల్లో ఉన్నారు. కేరళ నుండి 30 మంది, పశ్చిమబెంగాల్‌ నుండి 18, తమిళనాడు నుండి 14, త్రిపుర నుండి 10, పంజాబ్‌ 8, కర్నాటక 8, బిహార్‌ నుండి ఏడుగురు, ఉత్తరప్రదేశ్‌ నుండి ఐదుగురు, మహారాష్ట్ర నుండి ఆరుగురు, రాజస్థాన్‌ నుండి నలుగురు, హర్యానా నుండి ముగ్గురు, ఒడిస్సా నుండి ముగ్గురు, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, అస్సాం, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌ నుండి ఒక్కొక్కరు చొప్పున నూతన కమిటీకి ఎన్నికయ్యారు. సంఘం అఖిల భారత కేంద్రం నుండి విజయరాఘవన్‌, వెంకట్‌, విక్రమ్‌సింగ్‌, వి.శివదాసన్‌, బాబూమోహన్‌, షాజీ జనరల్‌ కౌన్సిల్‌లో ఉన్నారు. కేంద్రం నుండి ఒక ఖాళీ పెండింగ్‌ ఉంది, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌ నుండి ఒకరికి జనరల్‌ కౌన్సిల్‌లో అవకాశం కల్పించినా ఎవరనేది ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి జనరల్‌ కౌన్సిల్‌ సభ్యులుగా  వి.వెంకటేశ్వర్లు, డి.సుబ్బారావు, వి.శివనాగరాణి, కె.వి.నారాయణ, ఎం.నాగేశ్వరరావు, కె.ఆంజనేయులు, ఎం.పుల్లయ్య, ఎం.రాజేష్‌, ఎ.రవి,, డి.వెంకన్న, జి.సింహచలం, వి.అన్వేష్‌. తెలంగాణా నుండి జి.నాగయ్య, ఆర్‌.వెంకటరాములు, బి.ప్రసాదు, బి.పద్మ, పొన్నం వెంకటేశ్వర్లు, ఐలయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, కె.జగన్‌, పెద్ది వెంకటేశ్వర్లు, ఎ.వెంకటరాజమ్‌, డి.సరోజ, ఎం.ఆంజనేయులు, ఎ.వీరన్న, కె.నరసింహులు, ఎం.రాములు ఉన్నారు.

No comments:

Post a Comment