57 కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Telugu Lo Computer
0


సికింద్రాబాద్ తో పాటు మొత్తం 57 కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నోటిఫికేషన్ రక్షణశాఖ సంయుక్త కార్యదర్శి రాకేశ్ మిట్టల్ విడుదల చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు ఏప్రిల్ 30న ఎన్నికలు జరుగనున్నాయని రాకేశ్ మిట్టల్ తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మొత్తం 8 వార్డులున్నాయి.ఈ ఎనిమిది వార్డులకు ఏప్రిల్ 8న ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఓటర్ల జాబితాపై కంటోన్మెంట్ బోర్డు అధికార యంత్రాంగం కసరత్తు ఇప్పటికే ప్రారంభించింది. 2015లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగాయి. 2023 ఫిబ్రవరి 10న పాలకవర్గం కొలువుదీరింది. 2020 ఫిబ్రవరి 10 నాటికి పాలకవర్గం గడువు తీరింది. అనంతరం కేంద్రం నామినేటెడ్‌ సభ్యుడిని నియమించింది. బోర్డుకు ఎన్నికలు నిర్వహించాలని పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీనిపై స్పందించాలని న్యాయస్థానాలు కూడా కంటోన్మెంట్‌ బోర్డును ఆదేశించాయి. ఈ క్రమంలోనే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ బోర్డు పరిధిలోని సివిల్‌ ఏరియాను గ్రేటర్‌ హైదరాబాద్‌లో విలీనం చేసేందుకు గానూ విధి విధానాలపై కొన్నిరోజుల కిందట కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విలీన ప్రక్రియ ఊపందుకుంటుందనుకున్న తరుణంలో తాజాగా బోర్డు ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనేది సికింద్రాబాద్ సైనికనివాస ప్రాంతానికి చెందిన పౌర పరిపాలనా సంస్థ. ఇది హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ఉంది. భారతదేశంలో మొదటి అతిపెద్ద బతిండా సైనిక నివాసప్రాంత మండలి తరువాత సికింద్రాబాద్ సైనికనివాస ప్రాంతమండలి రెండవ అతిపెద్దదిగా గుర్తించబడింది. సికింద్రాబాద్ సైనిక నివాస ప్రాంతమండలి పరిధిలో ఎనిమిది వార్డులును కలిగిఉంది. ప్రధానంగా సైనిక ప్రాంతం కావడంతో, సికింద్రాబాద్ సైనికనివాస ప్రాంతమండలి భారత ప్రభుత్వ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చింది. ఇది 40.1 కి.మీ విస్తీర్ణంపై పరిపాలనను పర్యవేక్షిస్తోంది. ఇక్కడ అనేక సైనిక శిబిరాలు ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)