ప్రధాన సూత్రధారి నీహారిక ? - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 26 February 2023

ప్రధాన సూత్రధారి నీహారిక ?


తెలంగాణాలో ప్రస్తుతం బీటేక్ విద్యార్థి నవీన్ హత్య కేసు సంచలనంగా మారింది. కేవలం యువతిని దక్కించుకోవడం కోసం హరి హరకృష్ణ పక్కా ప్లాన్ తో నవీన్ ను కాల్ చేసి పార్టీ చేసుకుందామని తీసుకెళ్లి అక్కడ గొడవ జరగటంతో అతడని అతి కౄరంగా హతమార్చాడు. ఆ తర్వాత కేసును పక్కదాని ట్టించడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా హత్య చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు ఇంటికి రాకుండా బయట ఉన్నాడు. నవీన్ గుండె, చేతి వేలు, ప్రైవేటు పార్ట్స్ లను నరికి అతని ప్రియురాలు నీహారికకు  పంపాడు. అప్పుడు ఆమె వెరిగుడ్ బాయ్ అని రిప్లై కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఆమె ప్రొద్బలంతోనే ఇలా చేశాడా  లేదా  అదేదో ప్రాంక్ అనుకొని సరిగ్గా చూడకుండా రిప్లై ఇచ్చిందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో నిందితుడు నవీన్ తండ్రి ప్రస్తుతం సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిందితుడు నవీన్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తమ కొడుకు చేసింది తప్పే అని అన్నారు. అంతే కాకుండా.. మరొకరికి కడుపుకొత మిగిల్చడం నేరమని అన్నాడు. తమ కొడుకు చేసిన పనికి ఆ కుటుంబానికి కన్నీళ్లతో సారీ కూడా చెప్పాడు. అంతే కాకుండా.. తన కొడుకు చేసిన నేరానికి కోర్టు ఏవిధమైన పనిష్మేంట్ ఇచ్చిన గౌరవిస్తామని అన్నారు. అయితే.. తమ కొడుకును నీహారిక ప్రేమపేరుతో మోసం చేసిందని, నవీన్ ను చంపడానికి ఆమె కారణమని అన్నాడు. తన కొడుకు ఒక్కడే దీనిలో ఇరికించారని, కానీ దీనిలో నీహారికతోపాటు, మరికొందరి హస్తం కూడా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఇంటి దగ్గర రూమ్ కూడా తీసుకున్నారని, దీనిలో నవీన్ తో పాటు, యువతి, మరికొందరు తరచుగా వచ్చేవారని, వారందరిని పట్టుకుని విచారించాలని కోరారు. అంతేకాకుండా యువతి వాట్సాప్, కాల్ డాటా ను కూడా చూడాలని పోలీసులను కోరారు. ప్రేమ పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడటం తప్పని అన్నారు. తాను ఒక క్లినిక్ లో ఆర్ఎంపీగా పనిచేస్తున్నానని, ఒక ప్రాణం విలువ తనకు తెలుసని, కానీ తన కొడుకు ఇలా ఎందుకు చేశాడో అర్థం కావట్లేదని ఆవేదన చెందాడు. తన కొడుకు ఇంటికి వస్తే సీఐడీ లాంటి సీరియల్స్ చూస్తాడని అన్నాడు. ఎవరితోను గొడవలు పడినట్లు సంఘటనలు జరగలేదని చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అంతే కాకుండా అటు యువతీ, యువకుల మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలు, కాల్స్ డాటా రికవరీ చేసే పనుల్లో ఉన్నట్లు సమాచారం. 

No comments:

Post a Comment