అదానీ గ్రూప్ వికీపీడియాలో సమాచారాన్ని తారుమారు చేసింది ?

Telugu Lo Computer
0


అదానీ గ్రూప్ వికీపీడియాలో సమాచారాన్ని కూడా తారుమారు చేసిందంటూ ఆరోపణ వస్తోంది. కంపెనీల షేర్లకు కృత్రిమ డిమాండ్ సృష్టించిందంటూ హిండెన్ బర్గ్ నివేదిక ఇవ్వడంతో ఆ కంపెనీ షేర్లు పేకమేడల్లా కూలుతున్న సంగతి తెలిసిందే. గౌతమ్ అదానీ, ఆయన కుటుంబ సభ్యులు, గ్రూప్ కంపెనీలకు సంబంధించి పక్షపాతంతో కూడిన కంటెంట్‌ను వికీపీడియాలో యాడ్‌ చేశారని, వికీలో హెచ్చరికలనూ తొలగించారని వికీపీడియా ఆరోపించింది. దీనికోసం సాక్ పప్పెట్ ఖాతాలను, పెయిడ్ ఎడిటర్లను వినియోగించినట్లు వెల్లడించింది. అలాగే కంటెంట్ లో మార్పు చేసిన వారిలో అదానీ గ్రూప్ కంపెనీ ఉద్యోగులూ ఉన్నారని తెలిపింది. ఈమేరకు వికీపీడియాకు చెందిన న్యూస్ పేపర్ ది సైన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. అదానీ కంపెనీకి చెందిన ఓ పెయిడ్ ఎడిటర్ ఆ కంపెనీకి సంబంధించిన వ్యాసాన్ని పూర్తిగా మార్చేశారని, ఇదంతా అదానీ గ్రూప్ ఐపీ అడ్రస్ నుంచే జరిగిందని ఈ కథనం పేర్కొంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించిన వార్నింగ్ లను కూడా తొలగించారు. వికీపీడియా క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ కు సైతం దొరకని విధంగా వీటిని రూపొందించారని తెలిపింది. ఇటువంటి ఆర్టికల్స్ ను రివ్యూ చేసేందుకు ఉన్న రివ్యూయర్ హాచెన్స్ తన స్థానాన్ని దుర్వనియోగం చేయడంతో అతడిపై నిషేధం విధించినట్లు వికీపీడియా వెల్లడించింది. అదానీకి సంబంధించిన మొత్తం 9 ఆర్టికల్స్ లో ఏడింటిని ఆయన ఆమోదించారని, అవినీతికి పాల్పడితేనే ఈ పనిచేస్తారని పేర్కొంది. వికీపీడియాలో వచ్చిన ఈ కథనాన్ని హిండెన్‌బర్గ్‌ రీసెర్చి వ్యవస్థాపకుడు నాథే ఆండర్సన్‌ ట్వీట్‌ చేశారు. వికీపీడియాలో గతంలోనూ పలువురు బిలీయనీర్లు ఇలా పెయిడ్‌ ఎడిటింగ్‌లకు పాల్పడ్డ ఉదంతాలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్‌ స్పందించలేదు

Post a Comment

0Comments

Post a Comment (0)