ముస్లిం విద్యార్థులు గెడ్డం తీయరాదు !

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్‌లోని దేవ్‌బంద్‌లో ఉన్న దారుల్ ఉలూమ్ ముస్లిం విద్యార్థులు తమ గెడ్డాలను కత్తిరించుకోరాదని, పూర్తిగా తీయకూడదని  జారీ చేసిన తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ధిక్కరించినవారిని తమ సంస్థ నుంచి బహిష్కిస్తామని తెలిపింది. మౌలానా హుస్సేన్ అహ్మద్ హరిద్వారి ఈ ఆదేశాలను జారీ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. గెడ్డాన్ని ట్రిమ్ లేదా షేవ్ చేసుకోవడం ఇస్లాంకు వ్యతిరేకమని ఈ ఆదేశాల్లో తెలిపారు. ఈ ఆదేశాలను పాటించాలని, లేదంటే, బహిష్కరణకు సిద్ధపడాలని హెచ్చరించారు. వచ్చే సెమిస్టర్‌లో గెడ్డం లేకుండా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ఎవరైనా విద్యార్థి ప్రయత్నిస్తే, అనుమతించబోమని తెలిపారు. ఇస్లామిక్ స్టడీస్ విద్యార్థులు ఇటువంటి అవిధేయతను ప్రదర్శిస్తే సహించబోమని తెలిపారు. గెడ్డాన్ని ట్రిమ్ చేసుకున్న నలుగురు విద్యార్థులను ఈ నెల 6న డిస్మిస్ చేసినట్లు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)