అరుదైన లిథియం నిక్షేపాలు గుర్తింపు !

Telugu Lo Computer
0


తొలిసారి అత్యంత అరుదైన లిథియం నిక్షేపాలను జమ్మూ-కాశ్మీరులో గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఖనిజాన్ని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారని తెలిపింది. ఇది దాదాపు 59 లక్షల టన్నుల వరకు ఉంటుందని వివరించింది. జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మన దేశంలో మొట్టమొదటిసారి అత్యంత అరుదైన లిథియం  నిక్షేపాలను గుర్తించింది. ఈ నిక్షేపాలు జమ్మూ-కాశ్మీరు లోని రియాసీ జిల్లా, సలాల్-హైమన ప్రాంతంలో ఉన్నాయి. లిథియం, బంగారం సహా 51 ఖనిజాల క్షేత్రాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించినట్లు ఈ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో ఐదు బ్లాక్‌లు బంగారానికి సంబంధించినవని, మిగిలినవాటిలో పొటాష్, మోలిబ్డెనుమ్, బేస్ మెటల్స్ వంటివి ఉన్నాయని తెలిపింది. ఇవి జమ్మూ-కాశ్మీరు, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్య ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నాయని వివరించింది. 2018-19 ఫీల్డ్ సీజన్ నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలో ఈ బ్లాకులను సిద్ధం చేసినట్లు తెలిపింది. బొగ్గు, లిగ్నైట్‌లకు సంబంధించిన 17 రిపోర్టులను బొగ్గు మంత్రిత్వ శాఖకు అప్పగించినట్లు తెలిపింది. వీటిలో 7,897 మిలియన్ టన్నుల నిక్షేపాలు ఉన్నట్లు వివరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)