ఈ ఏడాది నుంచి చిరు వ్యాపారులకు ఈ సేవలు !

Telugu Lo Computer
0


చిరు వ్యాపారులకు ఈ ఏడాది నుండి డిజిటల్ లోన్ సేవలు ప్రారంభిస్తున్నట్లు కేంద్ర టెలికాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ డిజిటల్ సేవలు ద్వారా చిరు, విధి వ్యాపారులకు భారీ ఎత్తున బ్యాంకుల నుంచి రుణాలు పొందే వీలుంటుందని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి వైష్ణవ్.. డిజిటల్ పేమెంట్స్ ఫెస్టివల్ లో ప్రసంగిస్తూ యూపీఐ సర్వీస్ మాదిరిగానే దీన్ని కూడా ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా డిజన్ లో ఇది ఒక విజయం అని అభివర్ణించారు. ఈ డిజిటల్ లోన్ సర్వీస్ ను నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాబోయే 10, 12 సంవత్సరాల లో దేశంలో ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పుకొచ్చారు. గురువారం నాడు కేంద్ర మంత్రి యూపీఐ కోసం వాయిస్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ నమూనాను ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్ ఐటి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అల్కేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ యూపీఐ గ్లోబల్ పేమెంట్ ప్రోడక్ట్ గా మారనుందని స్పష్టం చేశారు. ఇందుకోసం ఇప్పటికే పలు దేశాలలో ఎన్సిపిఐ భాగస్వామ్యం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. యూపీఐ లావాదేవీలు స్థానిక భాషల్లో తీసుకురావడానికి మిషన్ భాషను జాతీయ భాష అనువాద మిషన్, డిజిటల్ పేమెంట్స్ కలిసి వచ్చాయని స్పష్టం చేశారు. సామాన్యుడు తన స్థానిక భాష ఇంటర్ ఫేస్ వాయిస్ ద్వారా చెల్లింపులు చేయటానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు. దేశంలో 18 భాషల్లో మాట్లాడటం ద్వారా ఎవరైనా చెల్లింపులు జరపవచ్చు. డిజిటల్ క్రెడిట్ లో ఇది ఒక గొప్ప విజయమని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)