కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకునికి ఈడీ సమన్లు

Telugu Lo Computer
0


మద్యం విధానం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకునికి సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణకు ఈ నెల 26న హాజరుకావాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ కోరిన సంగతి తెలిసిందే. ఈ విచారణకు తాను హాజరవుతానని సిసోడియా ప్రకటించారు. ఆయనను సీబీఐ గత ఏడాది అక్టోబరు 17న ప్రశ్నించింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మద్యం విధానంపై ఆరోపణలు రావడంతో దానిని ఉపసంహరించింది. అయితే ఈ విధానం అమలై ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చి ఉండేదని, కోట్లాది రూపాయల ఆదాయ నష్టం జరగడానికి కారణం లెఫ్టినెంట్ గవర్నర్ అని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. సీబీఐని సిసోడియా వెంటాడేలా లెఫ్టినెంట్ గవర్నర్ చేయడం వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దల హస్తం ఉందని ఆరోపిస్తోంది. బీజేపీ స్పందిస్తూ, మనీశ్ సిసోడియా నేతృత్వంలోని ఎక్సయిజ్ శాఖలో అవినీతిని కప్పిపుచ్చేందుకే నూతన విధానాన్ని ఉపసంహరించి, పాత విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారని ఆరోపించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)