దేశంలో భారీగా లిథియం నిక్షేపాలు బయటపడటంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా తాజాగా స్పందించారు. ఇకపై భారత్ భవిష్యత్తు అంతా ఎలక్ట్రిఫైయింగే అంటూ సంతోషం వ్యక్తం చేశారు. 'ఎలాంటి సందేహం లేదు. ఇకపై భారత్ భవిష్యత్తు అంతా ఎలక్ట్రిఫైయింగే' అంటూ ట్వీట్ చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో లిథియం అత్యంత కీలకమైంది. భారత్ కొన్నేళ్లుగా దేశీయంగా విద్యుత్తు వాహనాల తయారీని ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. బ్యాటరీలు, ఇతర విద్యుత్తు పరికరాల తయారీలో లిథియం ముఖ్యపాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి లోహాలను భారత్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో లిథియం నిల్వలు భారత్‌లో వెలుగు చూడటంతో భవిష్యత్తులో దీని దిగుమతులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, బ్యాటరీ ధరలు కూడా దిగిరానున్నాయి.
No doubt now, that India’s future will be ‘electrifying’ 

No comments:
Post a Comment