మైసూరు-చెన్నై వందే భారత్ రైలుపై రాళ్ల దాడి

Telugu Lo Computer
0


మైసూరు-చెన్నై మధ్య నడిచే వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. మైసూర్-చెన్నై వందే భారత్ రైలు శనివారం క్రిష్ణరాజపురం-బెంగళూరు మధ్య ప్రయాణిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రెండు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే, ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదని దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది. ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. ఈ నెల ప్రారంభంలో విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ రైలుపై కూడా రాళ్ల దాడి జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో రైలు వెళ్తున్న సమయంలో, కొందరు పిల్లలు రైలుపై రాళ్ల దాడి చేసినట్లు గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. దేశవ్యాప్తంగా ఇతర రైళ్లపై కూడా అనేక చోట్ల రాళ్ల దాడి జరుగుతోంది. గత ఏడాది దేశంలో రైళ్లపై 1,500 రాళ్ల దాడి ఘటనలు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల్లో 400 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)