జాతీయ పార్కులో షికారుకు వెళ్లితే ఖడ్గమృగాలు వెంటపడ్డాయి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 26 February 2023

జాతీయ పార్కులో షికారుకు వెళ్లితే ఖడ్గమృగాలు వెంటపడ్డాయి !


పశ్చిమ బెంగాల్ లోని ఆలీపుర్ద్వార్ జిల్లా స్థానిక జలదాపర జాతీయ పార్కులో షికారుకు వెళ్లగా, ఒక్కసారిగా ఖడ్గమృగాలు వెంటపడ్డాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. వీరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వాహనంలో సఫారీకి వెళ్లిన ఎనిమిది మందికి దారి లో ఖడ్గమృగాలు కనిపించాయి. అయితే వాటిని తమ కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో రెండు జంతువులు ఒక్కసారిగా వెంటపడ్డాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో డ్రైవర్ ఆ వాహనాన్ని రివర్స్ లో నడిపేందుకు ప్రయత్నించడంతో రోడ్డు పై నుంచి పక్కకు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, గైడ్ తో సహా ఐదుగురికి గాయాలయ్యాయి. 

No comments:

Post a Comment