ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా

Telugu Lo Computer
0


ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన వ్యక్తి అజయ్ బంగా (63) ఎంపికయ్యారు. ఆయనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. ప్రస్తుత వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడు డేవిస్ మాల్పాస్ ఈ ఏడాది చివర్లో పదవికి రాజీనామా చేయనున్న నేపథ్యంలో బైడెన్ అజయ్ పేరును ప్రతిపాదించారు. 'ఈ క్లిష్టమైన సమయంలో ప్రపంచ బ్యాంకును సమర్థంగా నడిపించడంలో, సమస్యలను ఎదుర్కోవడంలో అజయ్ బంగానే సరైన వ్యక్తి. ప్రైవేటు, ప్రభుత్వ వనరులను ఉపయోగించుకోవడంలో అజయ్ కి మంచి అనుభవం ఉంద'ని బైడెన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్, బేగంపేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో అజయ్ బంగా చదువుకున్నారు. ఐఐఎం ఢిల్లీలో ఎంబీఏ పూర్తి చేశారు. 2009లో అజయ్ మాస్టర్ కార్డు సీఈఓగా పనిచేశారు. అంతకుముందు సిటీ గ్రూప్ సంస్థకు చెందిన ఆసియా పసిఫిక్ వ్యవహారాలు చూసేవారు. ప్రస్తుతం అజయ్ జనరల్ అట్లాంటిక్ అనే సంస్థకు వైస్ చైర్మన్ గా పనిచేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)