హిండెన్ బర్గ్ దెబ్బకి 71 బిలియన్ల డాలర్ల అదానీ సంపద ఆవిరి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 20 February 2023

హిండెన్ బర్గ్ దెబ్బకి 71 బిలియన్ల డాలర్ల అదానీ సంపద ఆవిరి !


హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత రోజు నుంచి ఈ రోజు వరకు అదానీ ఆస్తులు 71 బిలియన్ల డాలర్లు ఆవిరై పోయాయి. అదానీకి జనవరి 24కు ముందు 120 బిలియన్ డాలర్ల ఆస్తులుండగా ఈ రోజు 49.1 బిలియన్ల డాలర్లున్నాయని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అదానీ నికర విలువ $49.1 బిలియన్లకు పడిపోయింది. ఈ రోజు ప్రపంచ సంపన్నుల జాబితాలో అతని స్థానం 25. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్ల జాబితా కూడా అదానీకి 25వ స్థానంఇచ్చింది. అయితే అతని నికర విలువ $47.6 బిలియన్ల కన్నా తక్కువగా ఉందని పేర్కొంది. అదానీ గత 24 గంటల్లో 2.8 బిలియన్ డాలర్లు నష్టపోయినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. గౌతమ్ అదానీ ఇకపై భారతదేశపు అత్యంత ధనవంతుడు కాదని, రిలయన్స్‌కు చెందిన ముఖేష్ అంబానీ $85 బిలియన్లతో భారత దేశ ధనవంతుల్లోమొదటి స్థానంలో ఉన్నాడని టెలిగ్రాఫ్ నివేదించింది. అదానీ స్కాం ను హిండెన్‌బర్గ్ బయటపెట్టే ముందురోజు వరకు అదానీ గ్రూప్ స్టాక్‌లు వేగంగా పెరుగుతూ వచ్చాయి. ఆ అతర్వాతి రోజు నుంచి అతి వేగంగా పతనమయ్యాయి. కాగా, అదానీ గ్రూప్, హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ 413 పేజీల లేఖ రాసింది. ఆ లేఖలో హిండెన్ బర్గ్ సంధించిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం కాకుండా తాము ఈ దేశ ప్రజల కోసం ఎంత గొప్ప పనులు చేస్తున్నామో చెప్పుకొచ్చింది. జాతీయవాదం, దేశభక్తి ఆయుధాలను కూడా ఎక్కుపెట్టింది అదానీ గ్రూపు. అంతేకాక తాము రుణాలను తిరిగి చెల్లిస్తున్నామని, డిఫాల్ట్ చేయబోమని పెట్టుబడిదారులను ఒప్పించే ప్రయత్నం కూడా చేసింది. అయినప్పటికీ అదానీ మదుపుదార్ల విశ్వాసాన్ని చూరగొనలేకపోయారు.

No comments:

Post a Comment