26వ తేదీన విచారణకు హాజరు కావాలని మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు

Telugu Lo Computer
0


ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో  26వ తేదీన విచారణకు హాజరు కావాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ బడ్జెట్ రూపకల్పన సందర్భంగా తాను సీబీఐ విచారణకు హాజరుకాలేనని, ఫిబ్రవరి చివరలో విచారణకు సహకరిస్తానని నిన్న తెలిపారు. సిసోడియా విజ్ఞప్తి మేరకు ఈనెల 26న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. అంతకుముందు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తాను విచారణకు హాజరు కాలేనని మనీశ్ సిసోడియా సీబీఐకి చెప్పారు. తన విచారణను ఫిబ్రవరి చివరి వారం వరకు వాయిదా వేయాలని సీబీఐని కోరుతూ లేఖ రాశారు. బడ్జెట్‌ను సకాలంలో సమర్పించడం ఆర్థిక మంత్రిగా తన కర్తవ్యమని, ఇది ఢిల్లీకి ముఖ్యమైన సమయమని చెప్పారు. దీని కోసం తాను 24 గంటలు పని చేస్తున్నాన్న మనీశ్ సిసోడియా.. తానేమీ పారిపోవాలని గడువు అడగడం లేదని వివరించారు. విచారణకు తాను ఎప్పుడూ సహకరిస్తానని, ఇప్పుడు మాత్రం ఈ నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)