ఆర్మీ నుంచి స్కార్పియో క్లాసిక్ ఎస్‌యూవీ ఆర్డర్ !

Telugu Lo Computer
0


వాహనాల తయారీ సంస్థ మహీంద్రా గ్రూపు.. సోషల్‌ మీడియా వేదికగా భారత సైన్యానికి ధన్యవాదాలు తెలిపింది. 1,470 'స్కార్పియో క్లాసిక్ ఎస్‌యూవీ' కార్లను ఆర్మీ ఆర్డర్ చేసినట్లు మహీంద్ర ఆటోమోటివ్స్ ప్రకటించింది. సైన్యం నమ్మకాన్ని చూరగొనడం తమకు గర్వకారణమని ట్వీట్ చేసింది. ఈ పోస్ట్‌పై స్పందించిన సంస్థ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర.. 'జై హింద్...' అంటూ సమాధానమిచ్చారు.  ఫైరింగ్ పోర్ట్‌లు, బుల్లెట్‌ ప్రూఫ్ అద్దాలు కలిగిన స్కార్పియో వేరియంట్లపై 2021లో రోడ్లపై సైన్యం పరీక్షించింది. ఆర్మీ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన మోడల్‌ను గతంలో జరిగిన డిఫెన్స్‌ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. కొత్తగా ఆర్డర్ చేసిన సుమారు 1,500 వాహనాలను భారత సైన్యానికి చెందిన 12 యూనిట్లలో వినియోగించనున్నట్లు సమాచారం. భారత సైన్యం సహా రక్షణ దళాలు ఇప్పటికే స్కార్పియో మోడళ్లతో పాటు మహీంద్రా 550 జీప్, టాటా జినాన్ మరియు సుమో, ఫోర్స్ గూర్ఖా, మారుతి సియాజ్ మరియు స్విఫ్ట్ డిజైర్ లను వినియోగిస్తున్నాయి. కొత్త వాహనాల కూడా చేరితే ఈ జాబితాలో స్కార్పియో సైతం స్థానం దక్కించుకోనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)