అయోధ్య నుంచి జనక్‌పూర్ పుణ్యక్షేత్రానికి ప్రత్యేక రైలు !

Telugu Lo Computer
0


భారత్, నేపాల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో అయోధ్య నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్ మధ్య 'శ్రీరామ – జానకి యాత్ర' పేరుతో భారత్ గౌరవ్ ఆధ్వర్యంలో డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలును నడిపేందుకు భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రైలు వచ్చే నెల 17న ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యాటక రైలు నందిగ్రామ్, సీతామర్హి, కాశీ, ప్రయాగ్‌రాజ్‌లను కూడా కవర్ చేస్తుంది. అయోధ్య, సీతామర్హి, ప్రయాగ్‌రాజ్‌ల సందర్శన గమ్యస్థానం వద్ద ఒకరోజు హాల్ట్‌లో కవర్ చేయబడుతుందని భారతీయ రైల్వే తెలిపింది. ఈ రైలులో అత్యాధునిక డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలులో రెండు ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, ఆధునిక వంటశాలతో పాటు అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. ఏడు రోజులు ప్రాతిపాదిత భారత్ గౌరవ్ టూర్టిస్ట్ రైలు పర్యటనలో అయోధ్యలో మొదటి స్టాప్ ఉంది. ఇక్కడ పర్యాటకులు శ్రీరామ జన్మభూమి ఆలయం, హనుమాన్ దేవాలయం, అదనంగా నందిగ్రామ్ లోని భారత్ మందిరాన్ని సందర్శించవచ్చు. సీతామర్హి రైల్వే స్టేషన్ నుంచి 70 కిలో మీటర్లు బస్సు ప్రయాణం ద్వారా జనక్‌పూర్‌లో ఉన్న సమయంలో రామ్ జాంకీ ఆలయం, సీతారామ వివాహ మండప్, ధనుష్ ధామ్ లను సందర్శించవచ్చునని భారతీయ రైల్వే తెలిపింది. ఏడు రోజులు పాటు ఈ ప్రయాణంలో అతిథులు దాదాపు 2500 కి.మీ ప్రయాణిస్తారు. ఈ ప్యాకేజీలో మొత్తాన్ని ఈఎంఐల ద్వారా కూడా చెల్లించే అవకాశాన్ని భారతీయ రైల్వే కల్పిస్తుంది. ఇందుకోసం Paytm, Razorpay చెల్లింపు గేట్వేలతో జతకట్టింది. పర్యాటకులు 3, 6, 9, 12, 18, 24 నెలల్లో ఈఎంఐల ద్వారా మొత్తాన్ని డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించొచ్చు. 18ఏళ్లు, ఆపై వయస్సువారికి కోవిడ్ -19 టీకా సర్టిఫికెట్ తప్పనిసరి అని భారతీయ రైల్వే పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)