బిర్యానీ హెల్తీ ఫుడ్ గా గుర్తింపు !

Telugu Lo Computer
0


హైదరాబాదీ బిర్యానీ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందింది. అంతే కాకుండా ఇది చాలా వరకు ఆరోగ్యకరమైనదని ఆఫ్రికన్ జనరల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నివేదికలో తేలింది. ఇందులో బియ్యం, మాంసం, నూనె, సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. హైదరాబాదీ బిర్యానీలో కోడిగుడ్డు, మాంసం, కూరగాయలు వాడటం వల్ల ఆరోగ్యవంతంగా తయారవుతుందని అధ్యయనంలో తేలింది. బిర్యానీలో పసుపు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, కుంకుమపువ్వు కలుపుతారు. ఇవన్నీ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉండటం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బిర్యానీలో పసుపు, నల్ల మిరియాలు కలుపుతారు. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లితో వంటకం రుచికరంగా తయారవుతుంది. ఇవి మనల్ని ఆరోగ్యంగా కూడా చేస్తాయి. వీటిలో సల్ఫర్ సమ్మేళనాలు, మెగ్నీషియం, విటమిన్ బి6, విటమిన్ సి అధికంగా ఉంటాయి. బిర్యానీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)