బొప్పాయి - లాభాలు - నష్టాలు !

Telugu Lo Computer
0


అన్ని సీజన్లలో అందుబాటులో వుండే పండు బొప్పాయి. చౌకగా దొరికే పండు.  దీనిని రోజూ తినడానికి ప్రత్యేక కారణం అందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బొప్పాయి కొన్ని వ్యాధులతో బాధపడేవారికి హాని చేస్తుంది. ముఖ్యంగా బ్లాడర్ స్టోన్స్‌తో బాధపడేవారు ఈ పండుకు దూరంగా ఉండాలి. బొప్పాయిలో ఫైబర్ , విటమిన్ సి తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యపరంగా శరీరానికి ఎంతో మంచింది. ముఖ్యంగా జీర్ణక్రియ, బరువు పెరగడం, మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యలకు ఈ పండు దివ్యౌషధం అని చెబుతారు. కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు ఈ పండును అసలు తినకూడదు. ఈ పోషకం క్యాల్షియంతో కలిస్తే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అస్తమా రోగులతో పాటు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు బొప్పాయి పండును తినకూడదు. ఈ పండులో ఉండే ఎంజైమ్ ఆస్తమా రోగులకు హానికరం. చాలా మంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదు, ఎందుకంటే ఇది వారికి హానికరం. కొన్నిసార్లు గర్భస్రావం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలెర్జీ లాంటి సమస్యతో బాధపడుతుంటే కూడా బొప్పాయిని తినకండి. అందులోని పాపైన్ కంటెంట్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)