డిప్యూటీ తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 23 January 2023

డిప్యూటీ తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు !


తెలంగాణ  ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డ మేడ్చల్‌ జిల్లాకు చెందిన డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ కుమార్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కొద్దిరోజుల క్రితం స్మితా సబర్వాల్ ఇంట్లోకి ఆనంద్ కుమార్ రెడ్డి అర్థరాత్రి అక్రమంగా ప్రవేశించి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఆనంద్‌కుమార్ రెడ్డితో పాటు అతడికి సహకరించిన స్నేహితుడు దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రతావలయంలో ఉండే ఐఏఎస్ ఇంట్లోకి అర్థరాత్రి ఒక అధికారి చొరబడటంపై విమర్శలు వస్తున్నాయి.

No comments:

Post a Comment