విశాఖ నుంచి తిరుపతి గుండె తరలింపు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 20 January 2023

విశాఖ నుంచి తిరుపతి గుండె తరలింపు


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం షీలా నగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయినమహిళకు చెందిన గుండెను తిరుపతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ కు తరలించారు. విశాఖ కిమ్స్ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. హార్ట్ తరలించే వాహనానికి ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా విశాఖ పోలీస్ సిబ్బంది సమన్వయంతో త్వరగా ఎయిర్ పోర్టుకు చేరుకునేలా కృషి చేశారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి పోలీసుల బందోబస్తుతో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తిరుపతి పద్మావతి హార్ట్ సెంటర్ కు మధ్యాహ్నం వరకు చేరుకుంది. దానం చేసిన బ్రెయిన్ డెడ్ పేషెంట్ సన్యాసమ్మ గుండె ఆసుపత్రికి చేరుకోగానే అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన నరసయ్య, రాధమ్మల కుమారుడు 15 ఏళ్ల విశ్వేశ్వరయ్యకు అమర్చే ఆపరేషన్ చేశారు. 

No comments:

Post a Comment