షారూఖ్ ఖాన్ ఎవరో తెలియదు !

Telugu Lo Computer
0


చాలా రోజులుగా 'పఠాన్' సినిమాపై వివాదం కొనసాగుతోంది. సినిమాలోని మొదటి పాట విడుదలైన అనంతరమే బట్టలు అభ్యంతరకరంగా ఉన్నాయని, మరింకేదో అంటూ రైట్ వింగ్ సహా భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర అబ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి చెందిన గ్రామ స్థాయి కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు ఈ సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పఠాన్ సినిమాపై నడుడు షారూఖ్ ఖాన్‭పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ సినిమా వివాదంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. పఠాన్ సినిమా గురించి తనకు తెలియదన్న ఆయన, 'షారూఖ్ ఖాన్ ఎవరు?' అంటూ స్పందించడం గమనార్హం. అసోం లోని గువహాటి నగరం, నారేంగిలో సినిమా ప్రదర్శించాల్సిన థియేటర్‌లోకి ప్రవేశించిన భజరంగ్ దళ్ కార్యకర్తలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. థియేటర్‌లోని పఠాన్ పోస్టర్లను షారూఖ్, దీపిక పోస్టర్లను చించివేశారు. దీనిపై శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనను ప్రశ్నించగా ఈ వ్యాఖ్యలు చేశారు. ”రకరకాల సమస్యల గురించి బాలీవుడ్ నుంచి చాలా మంది ఫోన్ చేసినా ఈ ఖాన్ నాకు ఫోన్ చేయలేదు. కానీ అతను చేస్తే, అప్పుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను'' అని అన్నారు. అయితే ఉల్లంఘించిన వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు సీఎం శర్మ వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)