కుక్కను 'కుక్క' అన్నందుకు చంపేశారు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 21 January 2023

కుక్కను 'కుక్క' అన్నందుకు చంపేశారు !


తమిళనాడులోని ఉలగంపట్టియార్‌కొట్టంలె నిర్మలా ఫాతిమా రాణి, ఆమె కుమారులు డానియల్‌, విన్సెంట్‌తో కలిసి ఉంటోంది. వీళ్లకు ఓ పెంపుడు కుక్కడ ఉంది. అయితే వాళ్ల పొరుగింట్లో ఉండే రాయప్పన్‌ (62) దానిని పేరుతో కాకుండా కుక్క అని సంభోధిస్తూ వస్తున్నాడు. ఇది నచ్చక పలుమార్లు రాయప్పన్‌ ను ఫాతిమా కుటుంబ సభ్యులు  హెచ్చరించారు. అయినప్పటికీ రాయప్పన్‌ అలానే పిలుస్తుండేవాడు. ఈ క్రమంలో ఒక రోజు పొలంలోని నీళ్ల పంపు ఆపేయమని రామప్పన్‌ తన కొడుకు కెల్విన్‌కి చెప్పాడు. దీంతో అతను వెళ్లేందుకు సిద్ధమవ్వగా ఆ పొలం పరిసరాల్లో కుక్కు ఉంటుందని అందువల్ల కర్రను కూడా తీసుకుని వెళ్లమని చెబుతుండగా, ఆ మాట విన్న డానియల్‌ కోపంతో నా పెంపుడు కుక్కను 'కుక్క' అంటావా అంటూ దూకుడుగా మీదకు వచ్చి రాయప్పన్‌ ఛాతిపై బలంగా ఒక పంచ్‌ విసిరాడు. దీంతో అక్కడికక్కడే రామప్ప కుప్పకూలిపోయి చనిపోయాడు. ఈ హఠాత్పరిణామనికి భయంతో డేనియల్‌ అతని కుటుంబంతో సహా పరారయ్యాడు. బాధితుడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందుతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత పోలీసులు తీవ్రంగా గాలించి నిర్మలా రాణి, ఆమె కుమారులను అరెస్టు చేశారు.

No comments:

Post a Comment