రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ట్విటర్ హ్యాక్‌ !

Telugu Lo Computer
0


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ తన ట్విటర్ హ్యాకింగ్‌కు గురైనట్లు ప్రకటించింది. కాసేపటికి పునరుద్ధరణకు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ట్విటర్‌ ఖాతాను ఓపెన్ చేయడానికి ఇవాళ కాసేపు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో ఆర్‌సీబీ డీపీ కూడా మారిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆర్‌సీబీ ఖాతాకు సంబంధించిన బయోలో ''సభ్యుడిగా కావడానికి, బోర్‌డ్‌ ఏపే లేదా ముటంట్‌ ఏపేని కొనుగోలు చేయండి. క్రియేటెడ్‌ బై యుగ ల్యాబ్స్‌'' అని హ్యాకర్లు మార్పు చేశారు. ఇలా ఆర్‌సీబీ ట్విటర్ హ్యాక్‌కావడం ఇదే మొదటిసారి కాదు. 2021 సెప్టెంబర్‌లోనూ ఫ్రాంచైజీ ఖాతాను హ్యాక్‌ చేశారు. ఎట్టకేలకు ఖాతాను పునరుద్ధరించడంతో ఆర్‌సీబీ స్పందించింది. ''మా ట్విటర్ ఖాతా కొన్ని గంటల కిందట హ్యాకింగ్‌కు గురైంది. అయితే టెక్నికల్‌ సిబ్బంది ప్రయత్నంతో సమస్యను పరిష్కరించాం. హ్యాకర్లు పెట్టిన ట్వీట్‌ను మేం తీవ్రంగా ఖండించాం. ఇప్పుడు ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాం. ఇబ్బంది కలిగినందుకు యూజర్లు, అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాం'' అని ఆర్‌సీబీ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)