ప్రమాదకర పర్యవసనాలకు సూచిక !

Telugu Lo Computer
0


ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ ట్రెండింగ్, వైరల్ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి మాట్లాడుతున్న ఒరిజినల్ వీడియోపైన, అదే వ్యక్తి ముఖం మారుతూ షారుఖ్ ఖాన్ మాట్లాడుతున్నట్లు, కోహ్లీ మాట్లాడుతున్నట్లు, టోనీ స్టార్క్, దుల్కర్ సల్మాన్ మాట్లాడుతున్నట్లు కనిపించింది. సదరు వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర, ఆ టెక్నాలజీ గురించి వార్నింగ్ ఇచ్చారు. సదరు వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర..'ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో ప్రమాదకర పర్యవసనాల గురించి హెచ్చరిస్తోంది. మనల్ని తప్పుదోవ పట్టించే ఈ కంటెంట్ ఒకింత వినోదభరితంగా ఉండొచ్చు. కానీ ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే పరిస్థితులు దారుణంగా మారతాయి. ఈ నేపథ్యంలో ఒక సమాజంగా మనం ఇటువంటి మోసపూరిత కంటెంట్ ను నిరోధించేందుకు ఎలా సిద్ధమవుతున్నాం? వీటి బారి నుండి రక్షణగా పని చేసే సాంకేతికతలు ఉన్నాయా?' అని రాసుకొచ్చారు. ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసిన వీడియోను చూసిన నెటిజన్లు.. ఆయన ప్రశ్నల్లో అర్థం ఉందని, భవిష్యత్తులో ఇలాంటి టెక్నాలజీ వల్ల అనర్థం తప్పదు అని అంటున్నారు. కొంతమంది తప్పుడు ఉద్దేశం కలిగిన వ్యక్తులు ఇలాంటి టెక్నాలజీని వినాశనానికి వాడుకుంటారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసిన వీడియోలో 'డీప్ ఫేక్' అనే టెక్నాలజీని వాడగా, ఇదే తరహాలోని 'ఫేస్ స్వాప్'లాంటి వాటిని నిషేధించాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)