బీజేపీపై స్వాతి మాలివాల్ ఆగ్రహం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 21 January 2023

బీజేపీపై స్వాతి మాలివాల్ ఆగ్రహం !


మహిళలపై వేధింపులకు సంబంధించి ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్పర్సన్‌ స్వాతీ మాలివాల్‌ చేసిన స్టింగ్ ఆపరేషన్ను బీజేపీ విమర్శడాన్ని తప్పుబట్టారు. ఆ పార్టీ చెప్పేవన్నీ అబద్దాలేనని, ప్రాణం ఉన్నంత వరకు మహిళా రక్షణ కోసం పోరాడుతానని ట్వీట్ చేశారు. ''నా గురించి అబద్ధాలు చెప్పి భయపెడదమని అనుకునే వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ చిన్న జీవితంలో చావును సైతం లెక్కచేయకుండా ఎన్నో పెద్ద పనులు చేశాను. నాపై ఎన్నోసార్లు దాడులు చేసినా ఆగిపోలేదు. ప్రతి దాడి అనంతరం నాలో ఫైర్ మరింత పెరిగింది. నా గొంతును ఎవరూ అణిచివేయలేరు. బతికి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను'' అని స్వాతి ట్వీట్ లో రాశారు. రాత్రి సమయంలో ఢిల్లీలో మహిళల భద్రతను పరీక్షించేందుకు ఎయిమ్స్ సమీపంలో స్వాతి మాలివల్ స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఓ వ్యక్తి కారుతో వచ్చి లిఫ్ట్ ఇస్తానని ఆమెను పలకరించాడు. అందుకు స్వాతి మాలివాల్ నిరాకరించింది. అయితే అతడు మళ్లీ వచ్చి కారులో ఎక్కాలని బలవంతపెట్టగా ఆమె అతడి చేయిని పట్టుకునేందుకు ప్రయత్నంచింది. అతను వెంటనే కారు గ్లాస్ పైకెత్తి ఆమెను 15 మీట్లరు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనపై ఆమె ఫిర్యాదు చేయగా.. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. స్వాతి మాలివాల్ పోస్ట్ చేసిన వీడియోపై బీజేపీ పలు ప్రశ్నలు సంధించింది. ఆమె ఆరోపణలు చేసిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వాడని చెప్పింది. ఢిల్లీ పోలీసుల ప్రతిష్ట దెబ్బతీసేందుకే ఆప్‌తో కుమ్మకై ఆమె ఇలాంటి వీడియో తీసిందని విమర్శించింది. ఘటన జరిగిన వెంటనే స్వాతి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఈ ఘటనను సృష్టించినట్లుందని బీజేపీ నేతలు విమర్శించారు.

No comments:

Post a Comment