రైలు డోరువద్దే పేదల జీవితాలు మగ్గిపోతున్నాయి.....!

Telugu Lo Computer
0


సోనూసూద్ తన ట్విటర్ ఖాతాలో రైలు ప్రయాణం చేస్తోన్న వీడియోను షేర్ చేశారు. అందులో ఆయన డోరు దగ్గర ఫుట్‌బోర్డ్‌పై కూర్చొని బయటికి చూస్తూ కనిపించారు. ఆయన తీరును పలువురు ఖండించారు. దీనిపై నార్తన్‌ రైల్వే స్పందించింది. 'సోనూసూద్‌, ఈ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మిమ్మల్ని అభిమానిస్తున్నారు. వారికి మీరు రోల్‌మోడల్‌. రైలు మెట్ల దగ్గర కూర్చొని ప్రయాణించడం ప్రమాదకరం. ఈ తరహా వీడియో మీ అభిమానులకు తప్పుడు సందేశాన్ని పంపుతుంది. ఇలాంటివి చేయకండి' అంటూ కాస్త ఘాటుగానే హెచ్చరించింది. సోనూ డిసెంబర్ 13న ఈ వీడియో షేర్ చేయగా, ఇప్పటికే ముంబయి రైల్వే పోలీసు కమిషనరేట్‌ కూడా దీనిని తప్పుపట్టింది. నిజజీవితంలో ఇలాంటి స్టంట్‌లు చేయొద్దని గట్టిగానే సూచించింది. ఈ విమర్శలపై తాజాగా సోనూ క్షమాణలు తెలియజేశారు. 'రైలు డోరువద్దే మగ్గిపోతున్న పేదల జీవితాలను అర్థం చేసుకునేందుకు నేను అక్కడ కూర్చుకున్నాను. రైల్వే వ్యవస్థ పనితీరు మెరుగుపరిచినందుకు ధన్యవాదాలు' అని ట్వీట్ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)