ఈరోజు నుంచి ఆధార్ అప్‎డేట్ క్యాంపులు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని ఇవాళ్టి నుంచి అప్‎డేట్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. జనవరి 19, 20,21,23,24 తేదీల్లో ఆధార్ అప్‎డేట్ సేవలు ఉండనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మళ్లీ ఫిబ్రవరి 7 నుంచి 10వ తేదీ వరకు నాలుగు రోజులపాటు రెండో విడత క్యాంపులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే పనులన్నీ నిలిచిపోయతాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు రాష్ట్రంలో దాదాపు 80లక్షల మంది ఆధార్ అప్ డేట్ చేసుకోని వారున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిని పరిష్కరించేందుకు ప్రత్యేక క్యాంపులతో ఆధార్ అప్ డేట్ కు ప్రభుత్వ చర్యలు చేపట్టింది. ఇవేకాకుండా ఆధార్ కార్డుల జారీ సంస్థ UIDAIఈ మధ్యే కొత్తగా తీసుకువచ్చని నిబంధనల ప్రకారం 10 ఏళ్లకోసారి ఆధార్ బయోమెట్రిక్ వివరాలను ఆప్ డేట్ చేసుకోవల్సిందేనని తెలిపింది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ సాషన్‌మోహన్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామ వార్డు సచివాలయాల శాఖ జిల్లాల ఇన్‌చార్జి అధికారులు, జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇవాళ్టి నుంచి రాష్ట్ర ప్రజలందరికి ఈ క్యాంపులు అందుబాటులోకి రానున్నాయి. ఆధార్ ఆప్ డేట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)