నూతన సీఎస్‌గా శాంతి కుమారి

Telugu Lo Computer
0


తెలంగాణ ప్రస్తుత సీఎస్ సోమేశ్ కుమార్ రిలీవ్ కావడంతో ఆ స్థానంలో శాంతికుమారి నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో వైద్య, ఆరోగ్యశాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. కేసీఆర్‌ మంత్రిగా ఉన్న సమయంలో మెదక్‌ కలెక్టర్‌గా పనిచేశారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.  సీఎస్‌గా ఆమె 2025 వరకు పదవీలో కొనసాగనున్నారు. ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతి కుమారి అమెరికాలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్‌గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్‌లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)