నీ బర్త్‌డే కదా! నా తరపు నుంచి ఈ చిన్న బహుమతి !

Telugu Lo Computer
0


అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా మరో ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకుంది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు పాటకు గానూ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌ అందుకున్నారు. లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన ఈ అవార్డుల ఫంక్షన్‌కు చిత్రయూనిట్‌ తమ ఫ్యామిలీస్‌తో సహా విచ్చేశారు. ఈ సందర్భంగా యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ అక్కడి మీడియాతో మాట్లాడాడు. అవకాశం వస్తే మార్వెల్‌ సినిమాలో నటించేందుకు రెడీ అని చెప్పుకొచ్చాడు. ఇక తనతో మాట్లాడుతున్న జర్నలిస్ట్‌ బర్త్‌డే అని తెలుసుకున్న తారక్‌ అతడికి ఓ గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు. 'ఈరోజు నీ బర్త్‌డే కదా, అందుకే నా తరపు నుంచి ఈ చిన్న బహుమతి. ఇది కచ్చితంగా నీకు నచ్చుతుందనుకుంటున్నా' అంటూ అతడి చేతిలో ఓ గిఫ్ట్‌ బాక్స్‌ పెట్టి ఆప్యాయంగా హత్తుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)