నాకు కుమారులు లేరు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 8 January 2023

నాకు కుమారులు లేరు !


ఇద్దరు కుమార్తెలు తప్ప కుమారులెవరూ లేరని నెల్లూరు జిల్లా ఉదయగిరి వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. తనను కుమారుడిగా అంగీకరించాలంటూ చంద్రశేఖర్‌రెడ్డికి మేకపాటి శివచరణ్‌ రెడ్డి అనే యువకుడు బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. శనివారం ఆయన విడుదల చేసిన ఓ వీడియో వైరలైంది. దీనిపై ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. 'నాకు ఇద్దరు కుమార్తెలు. కుమారులెవరూ లేరు. నా భార్యలైన తులసమ్మ, శాంతమ్మలకు పుట్టిన బిడ్డలు రచనా రెడ్డి, సాయి ప్రేమికా రెడ్డిలే నా రాజకీయ వారసులు. డబ్బుల కోసం నన్ను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలంటే నేరుగా రండి. నా వ్యక్తిగత జీవితంపై బురద జల్లాలని చూస్తే భగవంతుడు క్షమించడు' అని వీడియో సందేశంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. తనను కుమారుడిగా అంగీకరించాలంటూ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి మేకపాటి శివచరణ్‌ రెడ్డి అనే యువకుడు బహిరంగ లేఖ రాయడం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ లేఖతోపాటు పాత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. 'మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి నా తండ్రి. పద్దెనిమిదేళ్లు నా తల్లితో కాపురం చేసి వదిలిపెట్టారు. మమ్మల్ని రహస్యంగా ఉంచారు. మమ్మల్ని ఎప్పుడూ బయటకు రావద్దని కోరారు. అందుకే ఇన్నాళ్లూ ఆయనను ఇబ్బంది పెట్టలేదు' అని లేఖలో పేర్కొన్నారు. 'మీ సంపద, రాజకీయ వారసత్వం నాకు అక్కర్లేదు. తండ్రిగా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మిస్సయ్యాను. నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు, విద్యాభ్యాసం పూర్తయినప్పుడు, వివాహ సమయంలో, చివరకు నాకు బిడ్డ పుట్టినప్పుడూ మీతో పంచుకోలేదు. నేను బయటికి వస్తే మన కుటుంబానికి అవమానమని ఇంతవరకు రాలేదు. నా బాధను అర్థం చేసుకోండి' అని లేఖలో పేర్కొన్నారు.

No comments:

Post a Comment