కొత్త సెక్రటేరియెట్​కు గట్టి భద్రతా వ్యవస్థ !

Telugu Lo Computer
0


తెలంగాణ ప్రభుత్వం కొత్త సెక్రటేరియెట్​కు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నది. ప్రతి ఫ్లోర్​లో పోలీసు పహారా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం దాదాపు 300ల మంది పోలీస్​ సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బెటాలియన్ పోలీస్​ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించనున్నది. ఈ మేరకు ఇంటెలిజెన్స్​ డిపార్ట్​మెంట్​నుంచి డీజీపీ ఆఫీస్​కు గత నెల 12వ తేదీన సమాచారం అందింది. ఈ నెల 18న సెక్రటేరియెట్​ను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఓపెనింగ్​ తర్వాత అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉండడంతో డీజీపీ ఆఫీస్​ నుంచి టీఎస్​ఎస్​పీ బెటాలియన్​ ఏడీజీకి లెటర్​ వెళ్లింది. ఒకటి, మూడు, 8 బెటాలియన్ల నుంచి ఆరుగురు ఆర్​ఐలు, 14 మంది ఆర్​ఎస్​ఐలు, 50 మంది ఏఆర్​ఎస్​ఐ/హెడ్​కానిస్టేబుల్​, పీసీలు 217 మంది, ఎల్​జీఎస్​ 10 మందిని కేటాయిస్తూ బెటాలియన్ కమాండెంట్స్​కు సమాచారం వెళ్లింది. దాదాపు 25 ఏండ్లుగా సెక్రటేరియెట్​కు తెలంగాణ స్టేట్​స్పెషల్​ ప్రొటెక్షన్​ ఫోర్స్​పోలీసులు భద్రతనిస్తున్నారు. ఇప్పుడు కూడా వారి ఆధ్వర్యంలోనే సెక్యూరిటీ కొనసాగుతోంది. ప్రస్తుతం దాదాపు 120 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్​పీఎఫ్​ నుంచి ఎలాంటి సమస్యలు రాలేదు. అయితే, ఎస్​పీఎఫ్​ను కాదని బెటాలియన్​కు కొత్త సెక్రటేరియెట్​లో భద్రత బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్డర్​ లేకుండానే నేరుగా డీజీపీ ఆఫీస్​ నుంచి బెటాలియన్​కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంట్లోనూ ఏదో మిస్​ కమ్యూనికేషన్​ జరిగిందని కొందరు అధికారులు చెబుతున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)