రక్తపోటు ఉన్నవారు ఎండు చేపలు తినకుండా వుంటే మంచిది !

Telugu Lo Computer
0


ఎండు చేపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. రకరకాల కూరల్లో మిక్స్ చేసి డైలీ తినేవారు సైతం ఉన్నారు. సముద్ర తీర ప్రాంతాలకు దగ్గరగా ఉంటున్నవారు ఎండు చేపలు ఎక్కువగా తింటుంటారు. ఎండు చేపలో కొవ్వు ఆమ్లాలు , విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. డ్రై ఫిష్ ఎక్కువగా తినడం వల్ల మనిషి శరీరంలో రక్తపోటు పెరిగి.. గుండె సంబంధిత సమస్యలు వస్తాయని పలు పరిశోధనల్లో తేలింది. అధిక రక్తపోటు ఉన్నవారు ఎండు చేపలకు తినకపోవడమే మంచిదని డైటీషియన్లు సూచిస్తున్నారు. ఎండు చేపలు శరీరంలో ఉప్పు శాతాన్ని పెంచుతాయి. బాడీలో ఉప్పు ఎక్కువగా చేరినప్పుడు, రక్తం రక్తనాళాలను అధిక ఒత్తిడికి గురిచేస్తుంది. దీనివల్ల బీపీ పెరుగుతుంది. శరీరంలోని హార్మోన్లు, ఇన్‌ఫ్లమేటరీ, ఇమ్యునోలాజికల్, జీర్ణవ్యవస్థలను ఎఫెక్ట్ చేసే గుణాలు ఉప్పులో ఉంటాయి. డ్రై ఫిష్ ద్వారా శరీరంలో ఉప్పు శాతం పెరుగుతుంది కాబట్టి.. రక్తపోటు ఉన్నవారు దాన్ని అవౌడ్ చేయడం బెటర్. శరీరంలో ఉప్పు శాతం పెరిగితే మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)