పాట్నాలో దహీ ఖావో పోటీ !

Telugu Lo Computer
0

బీహార్ రాజధాని పాట్నాలో పెరుగు తినే పోటీలు పది సంవత్సరాలుగా జరుగుతున్నాయి. సుధా డైరీ అనే కంపెనీ ఈ పోటీలను నిర్వహిస్తున్నది. బీహార్ లోని అన్ని ప్రాంతాల నుంచి ఈ పోటీకి హాజరవుతారు. 'దహీ ఖావో పోటీ' ఇది మనకు కొత్త కానీ, బీహార్ వాళ్లకు సుపరిచితమే. పాట్నాలో మహిళలు, పురుషులు, సీనియర్ సిటిజన్ లతో సహా మూడు భాగాలకు పోటీలు జరుగుతాయి. పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేసేందుకు ఈ పోటీ నిర్వహిస్తున్నారు. బీహార్ మొత్తం మీద నుంచి 500 మంది పాల్గొన్నారు. పురుషుల్లో బార్హ్ కు చెందిన అజయ్ కుమార్ 3 నిమిషాల్లో 3 కిలోల 420 గ్రాముల పెరుగును తినడం ద్వారా మొదటి స్థానంలో నిలిచాడు. మహిళల్ పాట్నా నివాసి ప్రేమ తివారీ 3 నిమిషాల్లో 2 కిలోల 718 గ్రాముల పెరుగు తినడం ద్వారా అగ్రస్థానంలో నిలిచింది. మరో వైపు సీనియర్ సిటిజన్ డిఫెండింగ్ ఛాంపియన్ శంకర్ కాంత్ 3 నిమిషాల్లో 3 కిలోల 647 గ్రాముల పెరుగు తిని మొదటి బహుమతి గెలుచుకున్నాడు. ఈ ముగ్గురు పోటీదారులు దహీ శ్రీ టైటిల్ ను గెలుచుకున్నారు. శంకర్ కాంత్ 2020లో 4కిలోల పెరుగు తినడం ద్వారా ఈ టైటిల్ ని గెలుచుకున్నాడు. పాట్నా డెయిరీ ప్రాజెక్ట్ చైర్మన్ సంజయ్ కుమార్ ఈ పోటీలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)