అరుణాచల్‌ వద్ద చైనా అతి పెద్ద ఆనకట్ట నిర్మాణం ?

Telugu Lo Computer
0


అరుణాచల్‌ప్రదేశ్‌ సమీపంలో అతిపెద్ద డ్యామ్ నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ డ్యామ్‌ నిర్మాణంతో భారత్‌తోపాటు బంగ్లాదేశ్‌కు కూడా కృత్రిమ వరదల ముప్పు వచ్చే అవకాశాలున్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని యథేచ్ఛగా దారి మళ్లించే పనిని 11 ఏండ్లుగా చేస్తున్న చైనా, ఈసారి పెద్ద ఎత్తుగడనే వేసింది. అరుణాచల్‌లోని లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌ (ఎల్‌ఏసీ) కు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో అతి పెద్ద ఆనకట్టను నిర్మిస్తున్నది. ఇది చైనాలో ఉన్న అతి పెద్ద త్రీగోర్జెస్‌ డ్యామ్ కంటే కొంచెం పెద్దది. 181 మీటర్ల ఎత్తు, 2.5 కి.మీ వెడల్పుతో నిర్మించేందుకు చైనా సిద్ధమైంది. 60 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ఆనకట్టను మెడోగ్ సరిహద్దు పాయింట్ దగ్గర నిర్మించనున్నారు. ఇక్కడి నుంచే బ్రహ్మపుత్ర నది భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. చైనా ఎత్తుగడను దృష్టిలో ఉంచుకుని బ్రహ్మపుత్ర నదిపై ప్రతిపాదిత మూడు ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుల కింద నాలుగు పెద్ద ఆనకట్టలు నిర్మించనున్నారు. వీటికి అవసరమైన పర్యావరణ అనుమతులు కూడా త్వరలోనే అందనున్నాయి. ఈ ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అరుణాచల్‌ వద్ద నిర్మిస్తున్న డ్యామ్‌ సాయంతో చైనా  నీటి యుద్ధం చేపట్టి మనకు హాని కలిగించే కుట్ర పన్నినట్లుగా తెలుస్తున్నది. గత 11 ఏండ్లలో బ్రహ్మపుత్ర నదిపై చైనా 11 అతిపెద్ద హైడ్రోపవర్‌ ప్రాజెక్టులను నిర్మించింది. టిబెట్‌లోని 8 నగరాల్లో కూడా వేగంగా డ్యామ్‌లు కట్టేందుకు చైనా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తున్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)