ముంబయి ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 24 January 2023

ముంబయి ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత !


జనవరి 22 అర్ధరాత్రి తర్వాత ముంబయి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఓ విమానంలోని ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో ఓ విదేశీ ప్రయాణికుడు అనుమానాస్పదంగా కన్పించడంతో అతడి లగేజీని పరిశీలించారు. ఈ తనిఖీల్లో రెండు పుస్తకాల్లో దాచిన డాలర్ల కట్టలు బయటపడ్డాయి. అధికారుల కళ్లుగప్పేందుకు పుస్తకాల పేజీల మధ్య నోట్లను అతికించాడు. ఈ పుస్తకాల్లో మొత్తం 90వేల డాలర్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బుకు సంబంధించి ప్రయాణికుడి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను అధికారులు బయటపెట్టగా, ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

No comments:

Post a Comment