మైనర్ బాలికలను పెళ్లాడితే యావజ్జీవం !

Telugu Lo Computer
0


అస్సాం  కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ మీడియా సమావేశం నిర్వహించి పలు అంశాలను మీడియాకు వెల్లడించారు. అస్సాంలో 14 ఏళ్ల లోపు వయస్సున్న అమ్మాయిలను వివాహం చేసుకుంటే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి యావజ్జీవ శిక్ష విధించనున్నట్లు ఆయన తెలిపారు. అస్సాంలో మాతాశిశు మరణాల రేటు ఎక్కువగా ఉందని, ఈ మరణాలకు బాల్య వివాహాలే ప్రధాన కారణమని సీఎం అన్నారు. వచ్చే అయిదేళ్లలో బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి చర్యలు చేపట్టినట్లు సీఎం పేర్కొన్నారు. తాజాగా అస్సాం కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎవరైన 14 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకుంటే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. జీవిత ఖైదీ శిక్ష విధించనున్నారు. ఒక వేళ 14 ఏళ్ల లోపు బాలికను అదే వయసు ఉన్న బాలురు వివాహం చేసుకుంటే ఎలాంటి చర్యలు ఉంటాయని ఓ విలేకరి అడగగా ఒకవేళ అలాంటి వివాహాలు జరిగితే వాటిని చట్ట విరుద్దంగా ప్రకటించి, బాలుడుని జువైనల్ హోంకు తరలిస్తామని సీఎం చెప్పారు. అదే విధంగా 14 నుంచి 18 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకున్న వారిని బాల్య వివాహాల నిరోధక చట్టం కింద శిక్షించనున్నట్లు హిమంత బిశ్వశర్మ తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏ వర్గాన్నీ లక్ష్యంగా చేసుకుని తీసుకున్నది మాత్రం కాదని, దీనికి రాజకీయ రంగు ఆపాద్దించవద్దని హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)