నైనిటాల్, ఉత్తరకాశీలకు కూడా పొంచి ఉన్న ప్రమాదం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 8 January 2023

నైనిటాల్, ఉత్తరకాశీలకు కూడా పొంచి ఉన్న ప్రమాదం !


ఉత్తరాఖండ్ రాష్ట్రం హిమాలయ పర్వతాల్లో ఉన్న పట్టణాల్లో జోషిమఠ్ ఒకటి. అయితే కొన్ని రోజులుగా జోషిమఠ్ అనూహ్యంగా కుంగిపోతోంది. ఇళ్లు, రోడ్లకు బీటలువారుతున్నాయి. భౌగోళిక పరిస్థితులు, వాతావరణం ఈ పట్టణానికి ప్రమాదాలుగా మారాయి. అయితే ఇలా భూమిలో కూరుకుపోవడం ఒక్క జోషిమఠ్ కు మాత్రమే పరిమితం కాలేదని.. రానున్న రోజుల్లో నైనిటాల్, ఉత్తరకాశీలకు కూడా ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. హిమాలయాల దిగువన ఉన్న అనేక పట్టణాలు కూడా నేలలో కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూమి స్వభావంతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో హిమాలయ పట్టణాల్లో విపరీతంగా ఇళ్ల నిర్మాణాలు పెరిగాయి. దీనికితోడు ప్రకృతి పరిణామాలు, వాతావరణం కూడా ఈ పట్టణాల లైఫ్ ను తగ్గిస్తున్నాయి. విపరీతంగా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా అక్కడ బలహీనమైన భూమి కోతకు గురువుతోంది. ఈ ప్రాంతంలో భూమి అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియన్ టెక్టానిక ప్లేట్, యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్ ను ప్రతీ ఏడాది ఒక సెంటీమీటర్ ముందుకు నెడుతోంది. లక్షల ఏళ్ల క్రితం ఈ టెక్టానిక్ ప్లేట్ల యాక్టివిటీ కారణంగానే ఇప్పుడున్న హిమాలయాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలోనే ఉత్తరాఖండ్ లోని పలు పట్టణాలు ఉన్నాయి. మెయిన్ సెంట్రల్ థ్రస్ట్(ఎంసీటీ-2) కారణంగా భూమి అస్థిరంగా ఉంది. భూమి, ప్రకృతితో పోరాడి గెలవలేరని పలువురు జియాలజిస్టులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ప్రసిద్ధ వేసవి విడిది నైనిటాల్ కూడా జోషిమఠ్ లాగే ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ పట్టణం కుమౌన్ లెస్సర్ హిమాలయాల్లో ఉంది. 2016 నివేదిక ప్రకారం ఈ పట్టణంలోని కొన్ని ప్రాంతాలో కొండచరియలు విరిగిపడిన శిథిలాలపై నిర్మితం అయి ఉంది. నైనిటాల్ పట్టనం షెల్, స్లేట్ లతో కూడిన సున్నపురాయిని కలిగి ఉంది. ఈ రాళ్లు తక్కువ బలాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు జోషి మఠ్ లో చూస్తున్నదే నైనిటాల్, ఉత్తరకాశీ, చంపావల్ లో జరిగే ఆస్కారం ఉందని వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ మరియు గ్రాఫిక్ ఎరా హిల్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. 

No comments:

Post a Comment