పోలీసులపై నైజీరియన్లు దాడికి యత్నం !

Telugu Lo Computer
0


యాంటీ డ్రగ్స్ ఫోర్స్‌కు చెందిన ఒక పోలీసు బృందం ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ అక్రమంగా ఉంటున్న ఐదుగురు నైజీరియన్లు గుర్తించింది. వీసా గడువు ముగిసినప్పటికీ, ఢిల్లీలోనే ఉంటున్నారు. వాళ్లను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ తరలించాలనుకున్నారు. అలా ఐదుగురిని అదుపులోకి తీసుకుని వెళ్తుండగా, ఆఫ్రికా దేశాలకు చెందిన 150-200 మంది పౌరులు అడ్డుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనికి పోలీసులు అంగీకరించకపోవడంతో వారిపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు పట్టుకున్న వారిలో ఇద్దరు అక్కడ నుంచి పరారైయ్యారు. పోలీసులకు, ఆఫ్రికన్లకు మధ్య అక్కడ చాలా సేపు వాగ్వాదం జరిగింది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సాయంత్రం మరో బృందాన్ని అక్కడికి పంపిచారు. నిందితుల్ని అరెస్టు చేసి అనంతరం పోలీస్ స్టేషన్ తరలించారు. అరెస్టైన నిందితుల్లో ఒకరిపై గతంలో చీటింగ్ కేసు కూడా నమోదైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)