దేశంలో కొత్తగా 163 కొవిడ్ కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో కొత్తగా 163 కొవిడ్ కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,423లుగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.  రికవరీ రేటు ప్రస్తుతం 98.8 శాతం ఉన్నట్లు చెప్పింది. కొత్తగా కరోనా నుంచి 247 మంది కోలుకున్నారని, దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 4,41,46,781కి పెరిగిందని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.10 శాతం, వారాంతపు పాజిటివిటీ రేటు 0.11 శాతం ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు వినియోగించిన కరోనా డోసుల సంఖ్య 220.13 కోట్లుగా ఉన్నట్లు చెప్పింది. వాటిలో రెండో డోసులు 95.14 కోట్లు, ప్రికాషన్ డోసులు 22.43 కోట్లు ఉన్నాయని పేర్కొంది. నిన్న 58,938 డోసులను వినియోగించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.


Post a Comment

0Comments

Post a Comment (0)