ఓలా నుండి 200 మంది ఉద్యోగుల తొలగింపు

Telugu Lo Computer
0


క్యాబ్ ఆపరేటింగ్ కంపెనీ ఓలా 200మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ఉద్యోగం పోగొట్టుకున్న వారిలో ప్రోడక్ట్‌, టెక్నాలజీ విభాగాల్లో పనిచేసే వారే అధికంగా ఉన్నారు. 2022లో ఓలా 1100 మంది ఉద్యోగులను తొలగించగా ఓలా క్యాబ్స్‌, ఓలా ఎలక్ట్రిక్‌, ఓలా ఫైనాన్షియల్ సర్వీసు విభాగాల నుంచి ఎక్కువ మంది ఉద్యోగులు వేటుకు గురయ్యారు. కంపెనీ పునర్వస్థీకరణ చర్యల్లో భాగంగా తాజా లేఆఫ్స్ చేపట్టినట్టు ఓలా పేర్కొంది. అయితే ఇంజనీరింగ్‌, డిజైన్ విభాగాల్లో నియామకాలు ఉంటాయని, సీనియర్లను కూడా రిక్రూట్ చేసుకుంటామని ఓలా సంస్థ ప్రతినిధి ఒకరు వివరించారు. తొలగించిన ఉద్యోగులకు పరిహార ప్యాకేజ్ అమలు చేస్తామని తెలిపారు. గత ఏడాదిగా ఓలా ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయడంతో పాటు ఓలా ప్లే, ఓలా కార్స్‌, ఓలా డ్యాష్ వంటి సంస్థలను మూసివేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)