హిమాచల్ ప్రదేశ్ లో పాత పెన్షన్ విధానానికి కేబినెట్ ఆమోదం

Telugu Lo Computer
0


హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో పాత పెన్షన్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జాతీయ పెన్షన్ విధానం కింద 1.36 లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్ తీసుకునే వారు ఉన్నారు. కాగా, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. చెప్పినట్లుగానే ప్రభుత్వం ఏర్పడ్డ కొద్ది రోజులకే దీన్ని అమలు చేసి చూపించింది. పాత పెన్షన్ విధానాన్ని ఈరోజు నుంచే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేస్తున్నట్లు కేబినెట్ సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి సుఖు ప్రకటించారు. అయితే పాత పెన్షన్ విధానాన్ని తాము ఓట్ల కోసం తీసుకురావడం లేదని, ఇది హిమాచల్ ప్రదేశ్ ప్రజల హక్కని అన్నారు. దీనితో పాటు రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న అంశంపై కూడా ఆయన స్పందించారు. దీనిపై కమిటీ వేస్తున్నామని, ఆ హామీని కూడా నిలబెట్టుకుంటామని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)