ఐసీసీ అండర్‌-19 మహిళల టి20 ఫైనల్లో భారత్‌ !

Telugu Lo Computer
0


ఐసీసీ అండర్‌-19 మహిళల టి20 వరల్డ్‌కప్‌లో  శుక్రవారం న్యూజిలాండ్‌ వుమెన్స్‌తో జరిగిన తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 14.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 110 పరుగులు చేసింది. ఓపెనర్‌ షెఫాలీ వర్మ(10) విఫలమైనప్పటికి మరో ఓపెనర్‌ స్వేతా సెహ్రావత్‌(45 బంతుల్లో 61 పరుగులు నాటౌట్‌), సౌమ్య తివారీ(22 పరుగులు) రాణించడంతో భారత్‌ సులువుగానే విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ వుమెన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్లిమ్మర్‌ 35 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా, ఇసాబెల్లా గేజ్‌ 26 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పరశ్వీ చోప్రా మూడు వికెట్లు తీయగా.. తిటాస్‌ సాదు, మన్నత్‌ కశ్యప్‌, షఫాలీ వర్మ, అర్జనా దేవీలు తలా ఒక వికెట్‌ తీశారు. ఇంగ్లండ్‌ వుమెన్స్‌, ఆస్ట్రేలియా వుమెన్స్‌ మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్‌ విజేతతో జనవరి 29న భారత మహిళల జట్టు ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)