సమ్మె బాటలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి తమ వాయిస్ వినిపించారు. ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని వార్నింగ్ ఇచ్చారు. జీతాల చెల్లింపు, ఆర్ధికపరమైన విషయాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఏపీ సర్కార్ కి ఎన్నో డిమాండ్లు విన వస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ వేసింది ప్రభుత్వం. ఎప్పటికప్పుడు వారితో సంప్రదింపులు జరుపుతూనే వస్తోంది. పీఆర్సీ నుంచి అనేక సమస్యల పరిష్కారంలో మంత్రుల కమిటీ వన్ బై వన్ పరిశీలిస్తూ వస్తోంది. అయితే ఈ విషయంలో ఉద్యోగ సంఘాలు ఏమాత్రం సంతృప్తి చెందడం లేదు. దీంతో ప్రధాన సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వంపై తమ ఆరోపణలు తీవ్రతరం చేస్తున్నారు. సంక్రాంతిలోగా తమ సమస్యలను పరిష్కరించకుంటే.. ఆందోళనలకు సిద్ధమంటున్నారు. ఈ దిశగా ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బోపరాజు కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం నుంచి రావల్సిన బకాయిలు రావడం లేదని ఆరోపించారు బోపరాజు. జీతాలు పెన్షన్లు ఆలస్యమవడాన్ని తీవ్రంగా ఖండించారాయాన. మరో ప్రధాన సంఘం ఏపీ జేఏసీ కూడా ఇదే బాటలో వెళ్తోంది. జనవరి లోపు తమ సమస్యలను పట్టించుకోకుంటే ఉద్యోగ జేఏసీ సమ్మెకు వెళ్తుందని ప్రకటించారు ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు. జీతాల విషయంలో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామనీ, చీఫ్ సెక్రటరీ ఇచ్చిన హామీలు, నీటి మీద రాతలయ్యాయని అన్నారాయన. ఉద్యోగులు దాచుకున్న డబ్బు కూడా ప్రభుత్వం వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు బండి శ్రీనివాసరావు.అయితే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని చెప్పుకొచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎప్పటికప్పుడు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి సమన్వయం దిశగా ముందుకెళ్తున్నామని అన్నారాయన. ఉద్యోగులు తిరిగి సమ్మెకు వెళ్లే పరిస్థితి రాకుండా చక్కదిద్దుతామంటున్నారు సజ్జల. ఇటు ఉద్యోగులు అటు ప్రభుత్వం ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)