ఇక టీఆర్‌ఎస్‌ కాదు బీఆర్‌ఎస్‌ !

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్ర సమితి ఇక భారతీయ రాష్ట్ర సమితిగా అవతరించింది. దీనికి సంబంధించిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపింది. అక్టోబర్‌ 5న పార్టీ పేరు మార్పుపై ఈసీకి టీఆర్‌ఎస్‌ లేఖ పంపింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ గురువారం ఈసీ ఆమోదం తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం 1:20కి బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ కార్యక్రమం జరగనుంది. అనంతరం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరిస్తారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)