కోడి గుడ్డు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


ప్రతీ రోజూ ఒక కోడి గుడ్డు తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతుంటారు. ఎన్సీబీఐ నివేదిక ప్రకారం, గుడ్డులోని ప్రోటీన్ పిల్లల ఎత్తును పెంచడంలో సహాయపడుతుంది. అయితే గుడ్డు ఆరోగ్యానికి మంచిదని తెలిసినా కొన్ని రకాల అనుమానాలు నిత్యం వేధిస్తూనే ఉంటాయి.  న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్‌ ప్రియాంక షెరావత్‌ గుడ్డుకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఇందులో భాగంగానే ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుడ్డులో పచ్చసొన, పైన ఉండే తెల్లటి భాగం చూడడానికి వేర్వేరుగా ఉన్నప్పటికీ వాటి లక్షణాలు దాదాపు సమానంగా ఉన్నాయని తెలిపారు. కోడిగుడ్డులో తెల్లటి భాగం ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో పచ్చ సొన కూడా ఆరోగ్యమేనన్నారు. పచ్చసొనలో ఏ, ఈ, కే విటమిన్లు, ఒమేగా-3 పుష్కలంగా ఉంటాయని తెలిపారు. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)