సర్వే పేరుతో జీఎస్టీ అధికారులు వేదింపులు !

Telugu Lo Computer
0


క్రమం తప్పకుండా జీఎస్టీ చెల్లిస్తున్నప్పటికి జీఎస్టీ అధికారులు తమ వ్యాపారాలపై దాడులు నిర్వహిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్‌ వ్యాపారస్థులు డిమాండ్‌ చేశారు. తాము సకాలంలో పన్నులు చెల్లిస్తున్నామని, అయినా సర్వేల పేరుతో నిత్యం షాపులపై అధికారులు దాడులు చేస్తున్నారని అధికార పార్టీకి చెందిన ఫిరోజాబాద్‌ ఎమ్మెల్యే మనీశ్‌ అసిజాకు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జీఎస్టీ అధికారులు ఎలక్ట్రానిక్‌ షాపులు, గ్రాసరీ స్టోర్స్‌, బట్టల దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లపై క్రమం తప్పకుండా దాడులు చేస్తున్నారని, దీనివల్ల తాము భారీగా నష్టపోతున్నామని వాపోయారు. జీఎస్టీ సర్వే పేరుతో అధికారులు తమను వేధిస్తున్నారని చెప్పారు. యూపీలో మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జీఎస్టీ అధికారులు వాణిజ్య సముదాయాలపై తరచూ దాడులు నిర్వహిస్తున్నారు. దాడుల నేపథ్యంలో భయాందోళనలకు గురవుతున్న వ్యాపారస్థులు తమ దుకాణాలను మూసివేస్తున్నారు. జీఎస్టీ అధికారులు నిత్యం దాడులకు పాల్పడుతూ తమను వేధిస్తున్నారని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులను అడ్డుకుంటున్నారు. లలిత్‌పూర్‌ జిల్లాలో రాష్ట్ర మంత్రి మనోహర్‌ లాల్‌ పంత్‌, ఎమ్మెల్యే రామ్‌రతన్‌ కుష్వాహాను ఘెరావ్‌ చేశారు. జీఎస్టీ దాడులను అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)